ఇది కాలక్షేపం బఠాణీ కాదు, ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

బఠాణీలు అనగానే కాలక్షేపం బఠాణీలు అనీ, టైంపాస్ బఠాణీలు అని అంటుంటాం. కానీ బఠాణీలు తింటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: Freepik and webdunia

బఠాణీలు జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

బఠాణీల్లో విటమిన్ కె శాతం ఎక్కువ. ఎముక బరువు పెరగడానికి ఇది ఎంతో అవసరం.

అల్జీమర్స్, ఆర్థ్రైటిస్ తదితర వ్యాధులను అరికట్టేందుకు బఠాణీలు మేలు చేస్తాయి.

బఠాణీల్లో ఉండే కౌమెస్ట్రాల్ అనే పాలీఫినాల్ పొట్ట క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుందని తేలింది.

బఠాణీలలో ప్రోటీన్లు, పీచు పదార్థం ఎక్కువగా వుండటం వల్ల నెమ్మదిగా జీర్ణమవుతాయి.

బఠాణీల్లో పైటోస్టెరాల్స్ వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది.

బఠాణీల్లోని విటమిన్ సి యాంటీఆక్సిడెంటుగా పనిచేస్తూ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, వచ్చేసింది తినేయండి

Follow Us on :-