బత్తాయి రసంలో అల్లం, జీలకర్ర పొడి వేసుకుని తాగితే ఏమవుతుంది?

బత్తాయిలో పోషకాలతో పాటు ఔషధ గుణాలూ ఎక్కువే. బత్తాయిలను తీసుకుంటుంటే ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: Instagram

బత్తాయి రసంలో అల్లం, జీలకర్ర పొడి వేసుకుని తాగితే ఆస్తమా కారణంగా దగ్గుతో బాధపడేవాళ్లకీ ఉపశమనంగా ఉంటుంది.

మలబద్దకంతో బాధపడేవారికి బత్తాయిరసంలో చిటికెడు ఉప్పు వేసి తీసుకుంటే ఫలితం ఉంటుంది.

బత్తాయిలోని పొటాషియం మూత్రపిండాలు, మూత్రాశయంలో వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గడానికి దోహదపడుతుంది.

తరచూ ప్లూ, వైరస్‌లతో బాధపడేవాళ్లకి బత్తాయి రసం బాగా పని చేస్తుంది.

ఆస్టియో ఆర్ధ్రయిటీస్, రుమటాయిడ్ ఆర్ద్రయిటీస్‌తో బాధపడేవాళ్లకి బత్తాయిరసం తాగితే నొప్పులూ, పుండ్లు తగ్గుతాయి.

డయేరియా వల్ల కలిగే అలసటకీ, నీరసానికి బత్తాయిరసం అద్భుతమైన మందుగా పని చేస్తుంది.

గర్భిణుల్లో శిశువు పెరుగుదలకు బత్తాయిరసంలో పోషకాలన్నీ దోహదపడతాయి. ఇది రక్తవృద్ధికి కూడా తోడ్పడుతుంది.

ఉగాది పచ్చడిలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

Follow Us on :-