డయాబెటిక్ పేషంట్స్, వేసవిలో షుగర్ స్థాయిలు పెరగకుండా వుండాలంటే?
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మీకు చాలా చెమటను కలిగిస్తే, మీరు నిర్జలీకరణం(dehydrated) కావచ్చు, ఇది గ్లూకోజ్ స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో షుగర్ స్థాయిలు పెరగకుండా పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia
తీయనైన శీతల పానీయాలు కాకుండా మంచినీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా వుంచుకోవాలి.
గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా వున్నటువంటి గింజధాన్యాలు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
షుగర్ స్థాయిలు సాధారణ స్థితిలో వుండాలంటే మద్యపానాన్ని వదులుకోవాలి.
వేసవి ఎండలో కాకుండా కాస్త చల్లగా వున్నప్పుడే వ్యాయామం పూర్తి చేసుకోవాలి.
ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లు వున్నటువుంటి ఆహారం తీసుకుంటుంటే షుగర్ స్థాయిలు క్రమబద్ధంగా వుంటాయి.
కాఫీ, టీ అధికంగా తీసుకోకుండా వుండాలి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.