క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే ఫలితం ఏంటి?

కూరగాయల్లో రసంలా చేసుకుని తాగేవాటిలో క్యారెట్ ఒకటి. క్యారెట్లో పోషకాలు పుష్కలంగా వున్నాయి. క్యారెట్ తీసుకుంటుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Instagram

రక్తహీనత ఉన్నవారు క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే రక్తహీనత తగ్గిపోతుంది.

క్యారెట్ రసం, టమోటా రసం, చీనీపండ్ల రసాన్ని కలిపి కనీసం ఇరవై ఐదు గ్రాములు సేవించాలి.

ఈ మూడింటిని కలిపిన రసాన్ని రెండు నెలలపాటు సేవిస్తే నోటి అల్సర్, ముఖంపై ముడుతలు మాయమవుతాయి.

నిద్రలేమితో బాధపడుతుంటే ప్రతి రోజు ఉదయం-సాయంత్రం రెండుపూటలా క్యారెట్ రసాన్ని సేవిస్తే ఫలితం వుంటుంది.

క్యారెట్ రసాన్ని సేవిస్తుంటే ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం మరియు మలబద్దకం దూరమవుతాయి.

క్యారెట్‌ను ఉడకబెట్టి చల్లార్చిన తర్వాత కప్పు రసంలో చెంచా తేనెను కలిపి సేవిస్తే గుండెల్లో మంట మటుమాయం అవుతుంది.

క్యారెట్ రసం మహిళలల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు బాగా ఉపయోగపడుతుంది.

గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.

బరువు తగ్గడానికి తెల్ల గుమ్మడికాయ రసం, ఎలా చేయాలి?

Follow Us on :-