చలికాలంలో మెత్తని బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?
చలికాలంలో వెచ్చగా వుండేందుకు మెత్తని బొంతలో ముఖాన్ని కప్పుకుని నిద్రపోతుంటారు. ఇలా నిద్రపోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము.
credit: social media and webdunia
మెత్తని బొంతను ముఖాన్ని కప్పేసి నోరు మూసుకుని నిద్రపోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ.
ఆక్సిజన్ సక్రమంగా సర్క్యులేషన్ లేకపోవడం వల్ల కొవ్వు పెరగడంతోపాటు కండరాల్లో వాపు కూడా రావచ్చు.
ఆస్తమా వంటి వ్యాధులు కూడా పెరుగుతాయి.
శరీరంలో అధిక వేడి కారణంగా, జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది.
ఉదయం నిద్ర లేవగానే వాంతులు, తల తిరగడం, కడుపులో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఎక్కువ వేడి చేయడం వల్ల మెదడుపై ప్రభావం చూపుతుంది.
తలనొప్పి, నిద్రలేమి, కండరాల నొప్పి, వికారం, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి.
ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల కూడా బరువు పెరగవచ్చు.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాల కోసం నిపుణులను సంప్రదించాలి.