దొండ కాయలు తింటే ఏం జరుగుతుంది?

దొండ కాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద వైద్య శాస్త్రం చెపుతుంది. దొండలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. దొండ కాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Instagram

దొండ కాయలోని గుణాలు కాలేయం మీద నేరుగా పనిచేస్తాయి. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించగలవు.

దొండ కాయలో వున్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి, వీటి వల్ల జలుబు, దగ్గు దరిచేరవు.

దొండలోని బి-విటమిన్‌ నాడీవ్యవస్థకు మేలు చేస్తుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడేవాళ్లకి బాగా పనిచేస్తుంది.

రిబోఫ్లేవిన్‌ ఎక్కువగా ఉండే దొండ మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్‌ తగ్గడానికి దోహదపడుతుంది.

దొండలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. ఎముక సాంద్రత పెరిగేందుకూ తోడ్పడుతుంది.

దొండ కాయ ఆకుల పేస్టును రోజుకు మాత్రల్లా వాడితే బ్యాక్టీరియాతో ఏర్పడే చర్మ సమస్యలు వుండవు.

దొండ కాయ పిత్త వ్యాధులను, రక్తపోటును, వాత వ్యాధులను నియంత్రిస్తుందని ఆయుర్వేదం చెపుతోంది.

శనగలు రోజూ తింటే ఆరోగ్యానికి మంచిదా కాదా?

Follow Us on :-