పరగడుపున నారింజ రసం తాగితే ఏమవుతుందో తెలుసా?

నారింజ. ఈ పండులో విటమిన్ సి అధిక మోతాదులో వుంటుంది. నారింజను తింటే కఫం, వాతం, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. మూత్ర విసర్జన ప్రక్రియను సరళతరం చేస్తుంది. నారింజ తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Instagram and webdunia

నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి.

జ్వరాల బారిన పడి జీర్ణశక్తి తగ్గినప్పుడు నారింజను వాడితే అజీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు.

ఆహారనాళాలలో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తి కూడా నారింజకు కలదు.

నారింజలో బీటాకెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలోనూ నారింజ మేలు చేస్తుంది.

నారింజను రోజుకు ఒకటి తీసుకుంటే జలుబు, దగ్గు లాంటి అనారోగ్య సమస్యలు కూడా దరి చేరవు.

నారింజ తొక్కను ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకుని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని ఆ తర్వాత స్నానం చేస్తే నిగారింపు వుంటుంది.

నారింజ రసాన్ని పరగడుపున తీసుకోరాదు, అలా తాగితే అల్సర్స్, ఎసిడిటీ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఖాళీ కడుపుతో చాక్లెట్ తింటే ఏమవుతుంది?

Follow Us on :-