టైఫాయిడ్. ప్రస్తుతం సీజనల్ జ్వరాలు చాలామందిని పీడిస్తున్నాయి. వాటిలో టైఫాయిడ్ జ్వరం కూడా ఒకటి. ఇది ఒక పట్టాన వదలదు. ముందుగా గుర్తిస్తే మందులతో తగ్గుతుంది. ఐతే టైఫాయిడ్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాము.
credit: social media
పెరుగులో బిఫిడోబాక్టీరియా ఉంటుంది, ఇది టైఫాయిడ్ రోగులలో ఉబ్బరం- చెదిరిన ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది.
పుచ్చకాయ, ద్రాక్ష పండ్లు కూడా మేలు చేస్తాయి.
ఉడికించిన బంగాళాదుంపలు తింటే టైఫాయిడ్ జ్వరం తీవ్రం కాదు.
జీర్ణ సమస్యను లేవనెత్తనటువంటి గంజి లేదా జావ తాగితే ఉపశమనం కలుగుతుంది.
వైద్యుని సిఫార్సు మేరకు ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకుంటూ వుండాలి.
పండినటువంటి అరటిపండ్లు తినవచ్చు.
అన్నం కొద్ది మోతాదులో తింటూ వుండాలి.
మంచినీరు తీసుకుంటూ వుండాలి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.