మధుమేహం లక్షణాలు ఎలా వుంటాయో తెలుసా?

విపరీతమైన పని ఒత్తిడి. గంటల గంటలు కుర్చీల్లో కూర్చుని కంప్యూటర్ వర్క్. అక్కడే కూర్చుని తిండి. కాఫీలు, అల్పాహారాలు అన్నీ అక్కడే కానించేయడం. ఇలా చేస్తే శరీరం గుల్లవుతుంది. ఇలా చేసే వాటిలో మధుమేహం కూడా వుంటుంది. దాని లక్షణాలు ఏమిటో చూద్దాం.

credit: social media and webdunia

త్వరగా అలసిపోవడం, శరీరం నిస్సత్తువగా మారడం, నీరసం ఆవహించడం.

పనిలో ఆసక్తి లేకపోవడం, నాలుక తడారిపోవడం, విపరీతమైన దాహం.

తరచూ మూత్ర విసర్జన చేయడం. ఎక్కువ ఆహారం తీసుకుంటున్నా శరీరం బరువు తగ్గిపోవడం.

కంటి చూపు మందగించడం, కీళ్ళనొప్పులు, ఒంటినొప్పులు.

రోగ నిరోధక శక్తి తగ్గడం, తరచు వ్యాధులకు గురికావడం, కడుపులో నొప్పి.

చర్మం మంటగా ఉండటం, గాయాలు త్వరగా మానకపోవడం, వ్యక్తిగత భాగాల్లో దురద, మంట

శృంగార కోరికలు సన్నగిల్లడం, ఎప్పుడూ పడుకునే ఉండాలనిపించడం.

చర్మం ముడత పడటం, రక్తహీనత.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

Follow Us on :-