క్లీన్ బ్లడ్ కోసం తినాల్సిన పదార్థాలు ఏమిటి?

మన శరీరం మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో రక్తం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పరిశుద్ధమైన రక్తాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలను మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media

వెల్లుల్లిలో వుండే అల్లిసిన్ అనే సల్ఫర్ సమ్మేళనం శక్తివంతమైన రక్త ప్రక్షాళన చేస్తుంది.

కొత్తిమీర ఆకులు, క్లోరోఫిల్‌తో నిండి ఉండటం వల్ల అది రక్తాన్ని శుద్ధీకరిస్తుంది.

బీట్‌రూట్‌లో లివర్ యాక్టివ్ క్లెన్సింగ్ ఏజెంట్లు ఉన్నాయి, ఇవి రక్తాన్ని శుభ్రపరచడంలో దోహదపడతాయి.

పసుపు పాలలో వున్న డిటాక్స్ లక్షణాలు రక్తాన్ని క్లీన్ చేయడంలో సాయపడతాయి.

మిరియాలు శరీరం నుండి టాక్సిన్స్ వదిలించుకోవడం ద్వారా రక్తశుద్ధికి సహాయపడుతాయి.

నిమ్మకాయ ఒక సహజమైన డిటాక్సిఫైయర్. ఇది రక్తం నుండి వ్యర్థాలను శుభ్రం చేసి కాలేయంలో ఎంజైమ్‌లను సృష్టిస్తుంది.

మంచినీరు రక్తం యొక్క పిహెచ్ స్థాయిని అదుపులో ఉంచడం ద్వారా, వ్యర్థాలను తొలగించడం ద్వారా నిర్విషీకరణ చేస్తుంది.

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచి వ్యాధులతో పోరాడే శక్తివంతమైన రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు బ్లూ బెర్రీలలో ఉన్నాయి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

ప్రతిరోజూ జీడిపప్పు తినడం వల్ల కలిగే 7 అద్భుతమైన ప్రయోజనాలు

Follow Us on :-