వాల్ నట్స్, వీటిని తింటే ఏంటి ఉపయోగాలు?

వాల్ నట్స్ ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరంలో మెటబాలిక్ రేటును క్రమంగా పెంచుతాయి. వాల్ నట్స్ ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Instagram and webdunia

వాల్ నట్స్ బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

వాల్ నట్స్‌లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి అన్ని రకాల హార్ట్ డిసీజస్‌ను ఎదుర్కొనడానికి సహాయపడతాయి.

వాల్ నట్స్‌లో విటమిన్ ఇ, ప్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జ్ఞాపకశక్తి లోపానికి గురి చేసే హానికరమైన ఫ్రీరాడికల్స్, కెమికల్స్‌ను నాశనం చేస్తుంది.

ప్రతిరోజు మన ఆహారంలో వాల్ నట్స్‌ను చేర్చుకోవడం చాలా మంచిది. ఇది బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది.

నానబెట్టిన వాల్ నట్స్‌ను ప్రతిరోజు 5 చొప్పున తీసుకోవటం వలన కీళ్లనొప్పులు, వాపులు తగ్గిపోతాయి

గర్భిణీ స్త్రీలు ఈ నట్స్‌ను తినడం వలన లోపల ఉన్న పిండానికి ఎలాంటి ఎలర్జీలు కలుగకుండా వ్యాధినిరోధకతను పెంచుతాయి.

వాల్ నట్స్‌లో మెలటోనిన్ అనే కాంపౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం గాఢంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

చెరుకు రసం తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

Follow Us on :-