ఈ లక్షణాలు కనబడితే కిడ్నీలు చెడిపోతున్నాయని అనుకోవచ్చు
కిడ్నీలు శరీరంలో చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్‌లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వుంటాయో తెలుసుకుందాము.
credit: social media and webdunia
మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి.
కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది.
ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి, దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది.
కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది.
తరచుగా వికారం, వాంతులు వస్తాయి. రక్తంలో వ్యర్థాల ఫలితంగా ఇది జరుగుతుంది.
కిడ్నీల పనితీరు తగ్గితే ఎర్రరక్తకణాల ఉత్పత్తిపై ప్రభావం చూపి అలసట, మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
కిడ్నీలు ఉండే వీపు భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది, ఇది కిడ్నీలు చెడిపోయినప్పుడు కనపడే సాధారణ సంకేతం.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. మరిన్ని వివరాల కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి.