ధనియాలు తింటే మగవారికి ఏం జరుగుతుంది?

నిద్రలేమితో బాధపడే వారు ధనియాల కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది.

ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరుకుని గుళికల్లా చేసుకొని మూడు పూటలా ఒక్కోటి వేసుకొంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

గర్భవతులు తమ ఆహారంలో ధనియాలు తీసుకోవడం వల్ల గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది.

అజీర్తితో బాధపడేవారు ధనియాలు శుభ్రం చేసి తగినంత ఉప్పు కలిపి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడిచేసి రోజూ ఆ పొడి వాడితే సమస్య తగ్గుతుంది.

కడుపులో మంట, కడుపు నొప్పి, తలనొప్పి, మలబద్ధకం వున్నవారు ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకొని త్రాగితే తగ్గిపోతుంది.

బియ్యం కడిగిన నీటిని కలిపి ధనియాలు మెత్తగా నూరి, ముద్ద చేసి దానికి పటికబెల్లం చేర్చి కొద్ది మోతాదుల్లో తింటే పిల్లలకు తరచూ వచ్చే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.

వేసవిలో ఉదయాన్నే ధనియాలు తీసేసిన ఆ నీటిలో చక్కెర, పచ్చకర్పూరం వేసుకుని తాగితే శరీరానికి మంచిది.

ధనియాలు తీసుకోవడం వల్ల స్త్రీలతో పాటు పురుషులకు కొత్త శక్తి వస్తుంది, మేలు చేస్తుంది.

గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.

పుదీనా రసం తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

Follow Us on :-