గొంతునొప్పి తగ్గేందుకు చిట్కా వైద్యం

కొన్నిసార్లు కొందరికి అకస్మాత్తుగా గొంతునొప్పి వస్తుంటుంది. కొన్నిసార్లు గొంతు నొప్పి కారణంగా ఆహారం, నీటిని మింగడం కష్టతరం చేస్తుంది. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.

credit: twitter

తేనె కలిపిన వేడి టీ తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది.

గోరువెచ్చని ఉప్పు నీటితో బాగా పుక్కిలిస్తుంటే ఉపశమనం కలుగుతుంది.

గోరువెచ్చని నీటిని తరచుగా తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.

వీలైనంత వరకు చల్లని ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండాలి.

బ్లాక్ పెప్పర్‌తో కాఫీని తీసుకుంటే కూడా గొంతు నొప్పి నివారణ జరుగుతుంది.

వేడి పాలలో మిరియాలు కలుపుకుని తాగుతుంటే గొంతునొప్పి తగ్గుతుంది

గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.

మండుతున్న టొమాటోలు, వీటి ట్రూ స్టోరీ వింటే షాకవుతారు

Follow Us on :-