prevent kidney stones, కిడ్నీల్లో రాళ్లు రాకుండా ఏం చేయాలి?

కిడ్నీలు లేదా మూత్రపిండాలు. వీటిలో కొన్నిసార్లు రాళ్లు తయారవుతాయి. ఈ సమస్య వల్ల మొత్తంగా కిడ్నీలు పాడైపోయే ప్రమాదం వుంటుంది. అలాకాకుండా వుండేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

శరీరానికి అవసరమైన మంచినీళ్లను తాగుతూ వుండాలి.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది, కనుక మితంగా తీసుకోవాలి.

చక్కెర అధిక వినియోగం కూడా కిడ్నీలో రాళ్లకు కారణం అవుతుంది.

కృత్రిమ శీతల పానీయాలు, కాఫీని నివారించాలి.

సిట్రిక్ యాసిడ్ కలిగిన పండ్లు కాల్షియం శోషణను నిరోధించి కిడ్నీ రాళ్లను అడ్డుకుంటాయి.

ఆహారంలో ఆరోగ్యకరమైన మెగ్నీషియం ఉండేలా చూసుకోండి.

కిడ్నీలో రాళ్లను నివారించడానికి బరువు తగ్గడం కూడా మంచిది.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కిడ్నీలో రాళ్లను నివారించవచ్చు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

అనాస పువ్వుతో మహిళలకు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Follow Us on :-