రక్తశుద్ధికి గంగరావి చెట్టు కషాయం తాగితే?

గంగరావి చెట్టు. ఈ చెట్టు గురించి చాలామందికి తెలియదు. దీని ఆకులు రావిచెట్టు ఆకులను పోలి వుంటాయి. గంగరావి చెట్టుకి పలు ఔషధీయ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: Instagram

గంగరావి ఆకులను మెత్తగా దంచి కొంచెం వంటాముదం వేసి ఉడకబెట్టి ఆ ముద్దను గోరువెచ్చగా వాపులు వున్నచోట వేసి కడితే తగ్గిపోతాయి.

ముదిరిన గంగరావి బెరడు చూర్ణం చేసి దాన్ని గ్లాసు కషాయంగా కాచి తేనె కలుపుకుని తాగితే రక్తశుద్ధ జరుగుతుంది.

మూత్రంలో మంట తగ్గేందుకు గంగరావి పండ్లలోని రెండుమూడు గింజలు తీసుకుని దానికి చక్కెర కలిపి తింటే సరిపోతుంది.

గర్భ సమస్యలను నివారించడానికి గంగరావి చెక్కపొడి అద్భుతంగా పనిచేస్తుంది.

రెండు గంగరావి ఆకులను నలగ్గొట్టి గ్లాసు నీటిలో వేసి అవి సగమయ్యే వరకు మరిగించి వాటిని వడబోసి ఆ కషాయం గోరువెచ్చగా అయ్యాక తాగితే నోటిలో పొక్కులు తగ్గుతాయి.

గంగరావి చెట్టు ఆకులను మెత్తగా నూరి లేపనంగా చర్మంపై రాస్తే చర్మ సమస్యలు తగ్గిపోతాయి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

లేత మునగ ఆకు కూర పురుషులు తింటే ఏమవుతుంది?

Follow Us on :-