డయాబెటిస్. షుగర్ వ్యాధిగ్రస్తులు ఏమి తినకూడదో, ఏమి తినవచ్చో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ఎందుకంటే షుగర్ లెవల్స్ పెరిగాయంటే ఆరోగ్యానికి అది చేటు చేస్తుంది. కనుక జాగ్రత్తగా వుండాలి. మధుమేహులు ఏమేమి తినకూడదో తెలుసుకుందాము.
credit: social media
డయాబెటిక్ రోగులు చక్కెరతో నిండి వున్న డ్రైఫ్రూట్స్ తినకుండా ఉండాలి.
సపోటా పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడదు, ఇవి శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతాయి.
వైట్ బ్రెడ్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు హానికరం, ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువ.
మధుమేహ రోగులు బంగాళాదుంపలను చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.
పూర్తి కొవ్వు పాలు హానికరం, తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు తేనె సేవించకూడదు. ఇది రక్తంలో గ్లూకోజ్‌ని పెంచగలదు.
డయాబెటిక్ రోగులు ఎప్పుడూ ఫాస్ట్‌ఫుడ్ తీసుకోకూడదు, అది ప్రమాదకరం.
అన్నం తినడం కంటే దానికి బదులుగా గంజి లేదా జావ తీసుకోవచ్చు.
ఆహారంలో కొవ్వులు, నూనెల వినియోగాన్ని తగ్గించాలి. వేయించిన ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.