వడదెబ్బ నుంచి ఉపశమన మార్గాలు ఇవే

వేసవి ఎండలో తిరిగేవారికి వడదెబ్బ తగలడం సర్వసాధారణం. అలాంటపుడు ఇంటిపట్టునే చిన్నపాటి చిట్కాలు పాటిస్తే దాన్ని నుంచి త్వరగా కోలుకోవచ్చు.

credit: Instagram

తాగునీటిలో నిమ్మరసం, ఉప్పు, తేనె కలిపి గంటకోసారి తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

మేకపాలు తీసుకుని వడదెబ్బ తగిలిన వారి పాదాలకు, చేతులకు మర్దన చేస్తే త్వరగా తగ్గుతుంది.

నీరుల్లిపాయ రసాన్ని కణతలకు గుండెకు రాసినట్లయితే వడదెబ్బ తగ్గుతుంది.

చెమట రూపంలో కోల్పోయిన లవణాలు తిరిగి పొందాలంటే మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తాగుతూ ఉండాలి.

పండు చింతకాయ రసానికి ఉప్పు కలిపి తాగితే వడదెబ్బ నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

సబ్జా గింజలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల వేడి తాలూకు ప్రభావం తగ్గుతుంది.

గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.

కంది పొడిలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

Follow Us on :-