పెరుగులో బెల్లం వేసుకుని కలుపుకుని సేవిస్తే ఫలితాలు ఇవే

పెరుగులో బెల్లం వేసుకుని కలుపుకుని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media

పెరుగు-బెల్లం కలిపినది సేవిస్తుంటే గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు.

రక్తప్రసరణ మెరుగయ్యేందుకు పెరుగు-బెల్లం దోహదపడతాయి.

పెరుగులో బెల్లాన్ని కలిపి తీసుకుంటుంటే శరీరానికి క్యాల్షియం చేకూరుతుంది.

దంతాలు, ఎముకలు దృఢంగా వుండటానికి పెరుగులో తగినంత బెల్లం వేసుకుని తినాలి.

పెరుగు-బెల్లం కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటివి దరిచేరవు.

బరువు తగ్గాలనుకునేవారు పెరుగు-బెల్లం కలిపి తీసుకుంటుంటే ఫలితం వుంటుంది.

రక్తహీనత సమస్య వున్నవారు పెరుగులో బెల్లం కలుపుకుని తీసుకుంటుంటే సమస్య తగ్గుతుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

ఈ జబ్బులతో బాధపడేవారు ఉసిరి కాయను తినరాదు

Follow Us on :-