నీరు సరిపడా త్రాగడం లేదనడానికి గుర్తులివే

మంచినీరు రోజుకి కనీసం 3 లీటర్లు తాగితే దాదాపు అనారోగ్యాలు దరిచేరవంటారు. ఐతే కొంతమంది శరీరానికి అవసరమైన మంచినీళ్లు తాగరు. దానితో దేహంలో కొన్ని మార్పులు కనబడుతాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: Instagram

మంచినీరు తాగకపోతే చర్మం సాగినట్లు పొడిపొడిగా వుండటం.

నీరు తాగని వారి పెదవులు ఎండిపోయినట్లు కనబడుతాయి.

మూత్రం రంగులో తేడాలు రావడం కనబడుతుంది.

తలనొప్పి తరచుగా వస్తుండటం జరుగుతుంటుంది.

కొంతమందిలో కాళ్లు-చేతులు, శరీరం తిమ్మిర్లు వచ్చినట్లుంది.

గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు కనబడతాయి.

మలబద్ధకం సమస్యతో బాధ పడటం కనబడుతుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

బ్రెయిన్ పవర్‌కి తీసుకోవాల్సిన ఆహారం ఏంటి?

Follow Us on :-