జలుబును నివారించడంలో చిలగడదుంప చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ చిలకడదుంపలతో వెరైటీ వంటకాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము.
credit: social media and webdunia
తక్కువ మంట మీద చిలకడదుంపలను వేయించి, పైన నిమ్మకాయ, నల్ల ఉప్పు, చాట్ మసాలా వేసి సర్వ్ చేయండి.
ఉడికించిన చిలగడదుంపలో సుగంధ ద్రవ్యాలు కలిపి గుండ్రని టిక్కీలు తయారు చేసి పాన్ మీద వేయించాలి. దీన్ని చట్నీ లేదా పెరుగుతో తినండి.
చిలగడదుంప తురుము వేసి నెయ్యిలో వేయించి, పాలు, చక్కెర వేసి, డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించి ఈ హల్వాను వడ్డించండి.
చిలగడదుంపను ఉడికించి, ఉల్లిపాయ, వెల్లుల్లి, సుగంధ ద్రవ్యాలతో కలపండి. ఈ సూప్ టేస్టీగా వుంటుంది.