వసకొమ్మును అరగదీసిన గంధానికి తేనె కలిపి పిల్లలకి నాకిస్తుంటే?

వస చెట్టు. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేకత వుంది. వస చెట్టు గంధంతో చేదుగానూ, మూత్ర విసర్జనకరంగా, క్రిమినాశకారిగా వుంటుంది. వస చెట్టు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము.

credit: Instagram

వసకొమ్మును మంచినీళ్లతో అరగదీసి ఆ గంధాన్ని కడుపునొప్పితో బాధపడుతున్నవారి పొత్తికడుపుపై రాస్తే నొప్పి తగ్గుతుంది.

వసకొమ్ము, పసుపు, వాములను సమంగా తీసుకుని నీటితో నూరి ఆ తర్వాత నువ్వుల నూనె కలిపి ఉడకబెట్టి ఆ ముద్దను గోరువెచ్చగా దెబ్బలు, గాయాలపై రాస్తే తగ్గుతాయి.

వసకొమ్మును నీటితో అరగదీసి ముక్కుపైన తేలికగా లేపనం చేస్తుంటే రొమ్ముపడిశం తగ్గుతుంది.

వసకొమ్మును సానరాయిపై నీటితో అరగదీసి చిటికెడు గంధం రెండుమూడుబొట్లు తేనె కలిపి పిల్లల చేత నాకిస్తూ వుంటే మాటలు వస్తాయి.

వసకొమ్ములను నిప్పులపైన వేసి ఆ పొగను మూలవ్యాధి పిలకలకు తగిలేట్లు చేస్తే మొలల పోటు, నొప్పులు వెంటనే తగ్గిపోతాయి.

వసకొమ్ము, ధనియాలు, లొద్దుగచెక్క సమభాగాలుగా కలిపి పొడిచేసుకుని రాత్రివేళ తగినంత పొడిలో నీరు కలిపి మొత్తగా నూరి మొటిమలపై రాస్తే తగ్గుతాయి.

గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.

మోదుగ చెక్కరసంతో చేసిన కషాయం తీసుకుంటే ఏమవుతుంది?

Follow Us on :-