సీతాఫలం పండ్లు తింటున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోవాలి
సీతాఫలం. ఈ పండ్లలో విటమిన్లు, లవణాలు అధికంగా ఉంటాయి. సీతాఫలం మీగడలాంటి గుజ్జుతో, ప్రత్యేక రుచితో నోరూరిస్తుంది. ఎన్నో పోషక విలువలను శరీరానికి అందించే సీతాఫలం గురించి తెలుసుకుందాము.
webdunia
సీతాఫలంలో కొవ్వు ఏ మాత్రం ఉండదు. ఒక్కో సీతాఫలంలో 200 క్యాలరీల వరకు శక్తి ఉంటుంది.
నీరసంగా ఉన్నప్పుడు ఈ పండ్లను తిన్నట్లయితే శరీరానికి కావాల్సినంత గ్లూకోజ్ లభిస్తుంది.
ఈ పండు తింటుంటే కండరాలు బలోపేతమై బలహీనత, సాధారణ అలసటను దూరం చేస్తుంది.