తీవ్రమైన గుండెపోటును అడ్డుకునే నువ్వుల భస్మం, ఎలాగంటే?
నువ్వులు ముందుగా వేడి చేసినా ఆ తర్వాత చలువ చేస్తాయి. ఈ నువ్వులతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
credit: Instagram
నువ్వులకారం పొడి ఆహారంలో తీసుకుంటే వాతాన్ని, శరీరంలో చెడునీరును తీసేస్తుంది. ఎక్కువతింటే పైత్యం చేస్తుంది.
నువ్వుల వడియాలు తింటే చలువ శరీరులకు వేడి పుట్టిస్తుంది, శారీరక బలాన్ని పెంచుతుంది.
నువ్వులతో మసాల దినుసులు కలిపి చేసిన పచ్చడి రుచిగా వుండి జఠరాగ్నిని పెంచి వాతాన్ని పోగోడుతుంది.
వేయించిన నువ్వులు, బెల్లం కలిపి ముద్దచేసి నిద్రించే ముందు ఇరవై గ్రాముల ముద్ద తింటే మలబద్ధక వ్యాధి తగ్గుతుంది.
మంచినువ్వుల నూనెతో పావుగంటపాటు తైలమర్దనం చేస్తుంటే జీవితంలో ఎలాంటి రోగం దరిచేరదు.
కాల్చిన నువ్వుల చెట్ల బూడిదకి సమంగా యవక్షారం కలిపి పూటకి 2 గ్రాముల చొప్పున రెండు చెంచాల నిమ్మరసంతో తీసుకుంటే తీవ్రమైన గుండెనొప్పి తగ్గుతుంది.
అజీర్ణ సమస్యలకు నువ్వులు గొప్ప ఔషధంగా ఉపయోగపడుతుంది.
నువ్వులు, తెల్ల ఆవాలు, యవక్షారం సమానంగా తీసుకుని దంచి చూర్ణం చేయాలి. దీని నుంచి తగినంత చూర్ణాన్ని తీసుకుని పాలతో మెత్తగా నూరి మొటిమలపై రాస్తే తగ్గిపోతాయి.