సయాటికా నొప్పి నివారణకు ఏం చేయాలి?

సయాటికా నొప్పి తొడ కటి భాగం నుంచి పాదం వరకూ విపరీతంగా వుంటుంది. ఈ సమస్య నుంచి బైటపడేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాము.

photo credit: Freepik

సయాటికా నివారించేందుకు సరైన జీవనశైలిని అనుసరించడం, సమతుల్య పోషకాహారాలను తీసుకోవడం చేయాలి.

కూర్చునేటపుడు సరిగా కూర్చోవడం, నడవడం, శరీరానికి సరైన భంగిమను అనుసరించడం చేయాలి.

ఆరోగ్యకరమైన శరీర బరువును కలిగి వుండాలి, బరువులు ఎత్తే సమయంలో సరైన లిఫ్టింగ్ పద్ధతులను పాటించాలి.

సయాటికా నొప్పి కారణంగా కండరాలు, నాడులు కదలికలను కోల్పోతాయి.

అందువల్ల క్రమం తప్పకుండా యోగా, స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి.

ఒత్తిడి నిర్వహణ పద్ధతులను పాటించాలి. ధూమపానం, మద్యపానం మానుకోవాలి.

నరాలపై ఏర్పడిన ఒత్తిడిని తొలగించడానికి వార్మ్ కాంప్రెషన్ లేదా కోల్డ్ కాంప్రెషన్‌లను ఉపయోగించాలి.

నిద్ర సమయంలో సౌకర్యంగా, వెన్ను భాగాన్ని సపోర్ట్ చేసే పడకలను ఉపయోగించాలి.

వైద్యుల సూచనల మేరకు నొప్పిని నివారించే మందులు కూడా వాడవచ్చు.

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే ఏమవుతుందో తెలుసా?

Follow Us on :-