రొయ్యలు. ప్రపంచంలోని అత్యంత రుచికరమైన, ప్రయోజనకరమైన మత్స్య సంపదలో ఒకటి. రొయ్యలు స్థూల, సూక్ష్మపోషకాలను కలిగి ఉంటాయి. రొయ్యలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media
రొయ్యలులో వున్న విటమిన్ B12 బలహీనత, అలసట, డిప్రెషన్ వంటి వివిధ ఆరోగ్య సమస్యలున్నవారికి మేలు చేస్తుంది.
రొయ్యలు తక్కువ కేలరీల పోషకాహారం కలిగిన ఆహారం కనుక శరీర బరువు తగ్గించుకోవచ్చు.
రొయ్యలులోని సెలీనియం శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.
రొయ్యలులో విటమిన్-ఇ వుంటుంది కనుక వీటిని తింటే చర్మం ఆరోగ్యంగా వుంటుంది.
రొయ్యలలోని జింక్ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.