పైనాపిల్ తింటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వున్నాయి, అవి ఏంటంటే?
అనాస లేదా పైనాపిల్. ఈ పండు ఆరోగ్యానికి చేసే మంచి చాలా వుంది. ఐతే అది మితిమీరి తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం లేకపోలేదు. అవేమిటో తెలుసుకుందాము.
credit: Instagram
అనాస పండ్లు సురక్షితం అయినప్పటికీ వీటిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తం పలచబడటానికి కారణం కావచ్చు.
పైనాపిల్‌లో ఎంజైమ్ బ్రోమెలైన్ ఉండటం వల్ల మోతాదుకి మించి తింటే సమస్య తలెత్తుతుంది.
తల్లిపాలు ఇచ్చేవారు, గర్భిణీలు అనాస పండుకి దూరంగా వుండటం మంచిదని వైద్య నిపుణులు చెపుతారు.
అనాస రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది, కనుక డయాబెటిక్ పేషంట్లకి మంచిది కాదు.
యాంటీ డయాబెటిక్ ఔషధాలతో పాటు అనాస తీసుకునేటప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పర్యవేక్షించుకోవాలి.
కడుపులో గడబిడగా వుండటం, విరేచనాలు, గొంతులో వాపు, రుతు సమస్యలు, వికారంగా వుండటం వంటివి కూడా తలెత్తవచ్చు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం వైద్య నిపుణుడిని సంప్రదించాలి.