పచ్చి బఠానీ 5 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పచ్చి బఠానీలో పొటాషియం, ఇనుము, రాగి, మెగ్నీషియం, జింక్, సెలీనియం ఉంటాయి. ఇవి కాకుండా విటమిన్లు కూడా పుష్కలంగా వుంటాయి. అందువల్ల ఈ పచ్చి బఠానీలను ఆహారంలో భాగం చేసుకుంటే 5 ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

బఠానీలలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, ప్రేగులు ఆరోగ్యంగా వుండేందుకు దోహదపడుతుంది.

బఠానీలలోని ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

బఠానీలలోని విటమిన్లు సి, ఇ, జింక్, ఇతర యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

బఠానీలలోని పోషకాలు గుండె జబ్బులు, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

బఠానీలలోని మెగ్నీషియం చర్మం కుంగిపోకుండా ఉండటానికి, వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేయడానికి సహాయపడుతుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాల కోసం నిపుణులను సంప్రదించాలి.

తమలపాకు మరిగించిన నీరు తాగితే ఆ సమస్యలు ఔట్

Follow Us on :-