కమలా పండు ఆరోగ్యకారి, అతిగా తింటే మాత్రం...

కమలా పండు ఎంతో ఆరోగ్యకారిగా ఉపయోగపడటమే కాకుండా, సిట్రిక్ యాసిడ్ కారణంగా కాస్త పులుపు, రుచిని కలిగివుంటుంది. ఈ పండు గురించి తెలుసుకుందాము.

webdunia

ఉబ్బసం సమస్యతో ఇబ్బంది పడేవారు కమలారసంలో ఉప్పు, మిరియాల పొడి కలిపి సేవిస్తే తగ్గిపోతుంది.

మూత్రంలో మంట ఉన్న వారు కమలారసంలో లేత కొబ్బరి నీటిని కలిపి సేవిస్తే బాధ తగ్గుముఖం పడుతుంది.

టీబీ, టైఫాయిడ్‌ లాంటి వాటితో బాధపడే వారికి కమలారసం రోగనివారిణిగా ఉపయోగపడుతుంది.

కమలా రసాన్ని తాగితే శరీరంలో నిరోధకశక్తిని పెరుగుతుంది.

కమలాకాయలు తింటుంటే కాలేయం, గుండె, మూత్రపిండాలను సక్రమంగా పని చేస్తాయి.

దగ్గు, ఆయాసం వున్నవారు గ్లాసుడు కమలారసంలో చిటికెడు ఉప్పు, చెంచా తేనె కలిపి తాగితే శక్తి వస్తుంది.

ఐతే ఎక్కువగా నారింజ తింటే అతిసారం, వాంతులు, వికారం, గుండెల్లో మంట, ఉబ్బరం, తిమ్మిర్లు, నిద్రలేమి వంటి దుష్ప్రభావాలు కలగొచ్చు.

సీతాఫలం ఎవరు తినవచ్చు, ఎవరు తినకూడదు?

Follow Us on :-