లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

ఒక్క మైసూర్ బోండా. ఒక్కటి తింటే చాలు 227 కేలరీలు లభిస్తాయి. కార్బోహైడ్రేట్లు 93 కేలరీలు, ప్రోటీన్లు 17 కేలరీలుంటే ఏకంగా 110 కేలరీలు కొవ్వు నుండి వస్తాయి. మైసూర్ బోండా తింటే కలిగే సమస్యలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

మైసూర్ బోండా అనేది మైదా పిండితో చేసిన వంటకం.

మైదా పిండితో చేసిన ఏ పదార్థమైనా అది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తుంది.

మధుమేహం, గుండె సమస్యలున్న వారు అస్సలు ఈ బోండా జోలికి వెళ్లకూడదు.

మైసూర్ బోండా డీప్ ఫ్రై చేయడం వల్ల నూనె శోషణ పెరిగి కొవ్వు స్థాయిలు పెరుగుతాయి.

మైదాపిండిలో చెడు కొవ్వు శాతం ఎక్కువగా వుంటుంది. ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలను తెస్తుంది.

బోండాలను తింటే బరువు పెరిగి, ఇన్సులిన్ నిరోధకత కలిసి అధిక రక్తపోటు సమస్య వచ్చేలా చేస్తాయి.

మైసూర్ బోండాలను తిన్నప్పుడు కడుపులో ఏదో బండపెట్టిన ఫీలింగ్ చాలామందికి కలుగుతుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Follow Us on :-