బత్తాయి రసం. ఈ రసం జీర్ణక్రియలో సహాయపడుతుంది. బత్తాయి ఆమ్ల స్వభావం కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియను సక్రమంగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇంకా బత్తాయి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia
చిగుళ్ళు- దంతాల వ్యాధులను నివారిస్తుంది.
రోగనిరోధక వ్యవస్థను పునరుద్ధరిస్తుంది.
ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
కాలేయం, కళ్ళు, చర్మం, కేశాలకు మేలు చేస్తుంది.
గర్భధారణలో సమయంలో బత్తాయి రసం తాగుతుంటే మంచిది.
బరువు నియంత్రణలో బత్తాయి ఉపయోగపడుతుంది.
నాడీ వ్యవస్థకు సహాయం చేసే గుణం బత్తాయి రసంలో వుంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.