నల్ల మిరియాలు రెండు నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే ఏమవుతుంది?

జలుబు చేసినా, జ్వరం వచ్చినా మిరియాలను వాడటం మనం చూస్తుంటాం. వీటిలో పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వాటి వలన కలిగే కొన్ని ప్రయోజనాలు తెలుసుకుందాము.

credit: Instagram and Twitter

నల్ల మిరియాలు మసాలాగానే కాకుండా వివిధ రూపాల్లో తీసుకోవడం వలన అవి క్యాలరీలు బర్న్ చేసి కొత్త ఫ్యాట్ సెల్స్ రాకుండా చూస్తాయి.

నల్ల మిరియాల్లో విటమిన్ ఎ, సి, కె, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి.

ప్రతిరోజూ ఉదయాన్నే ఒకటి రెండు నల్ల మిరియాలను నేరుగా నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే శరీరంలోని మెటబాలిజం క్రమబద్ధం అవుతుంది.

సన్నబడాలనుకునేవారు నల్ల మిరియాలను ఆహారంలో చేర్చుకుంటే మంచిది.

వెజిటేబుల్ సలాడ్స్‌పైన నల్ల మిరియాల పొడిని చల్లి తింటే శరీర రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

మిరియాల పొడిని టీలో కూడా వేసుకుని తాగుతుంటే గొంతులో గరగర తగ్గుతుంది.

గ్లాస్ నీటిలో ఒక చుక్క ఒరిజినల్ బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ను వేసుకుని ఉదయాన్నే అల్పాహానికి ముందు తాగితే బరువు తగ్గవచ్చు.

అందమైన రోజా పువ్వులుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

Follow Us on :-