మిరియాలు తీసుకుంటే ఆరోగ్యమా అనారోగ్యమా?

మిరియాలు వంటకాలలో తప్పనిసరిగా ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయిని వైద్యులు చెపుతారు. అవేమిటో తెలుసుకుందాము.

credit: Instagram

దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాల పొడి, శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమం రెండు రోజులకోసారి చెంచా చొప్పున తీసుకోవాలి.

దంత సమస్యలకు మిరియాల పొడి, ఉప్పు కలిపిన మిశ్రమం తీసుకుంటే చక్కని పరిష్కారం కనిపిస్తుంది.

మిరియాల వల్ల జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉంటుంది.

శరీరంలో అధిక కొవ్వు తగ్గించాలంటే మిరియాల రసం తాగితే ఫలితం వుంటుంది.

గొంతు గరగరగా వుంటే గోరువెచ్చని పాలలో కాస్త మిరియాల పొడి, చిటికెడు పసుపు వేసి తాగితే ఉపశమనం కలుగుతుంది.

మిరియాలలో క్యాల్షియం, విటమిన్ సి, బీటా కెరోటిన్, అమినో యాసిడ్‌లు పుష్కలంగా లభిస్తాయి.

నిమ్మరసంతో చేసే జ్యూస్‌పై కొద్దిగా మిరియాల పొడి చిలకరించి తాగితే శరీర రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అలాగే మిరియాల టీ కూడా తాగవచ్చు.

నాగజెముడు రెడ్ ఫ్రూట్స్, తింటే ఏమవుతుందో తెలుసా?

Follow Us on :-