శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌, ఎలా తయారు చేయాలి?

బాదం, రాగి మాల్టులతో తయారు చేసుకునే పానీయం రుచిగా వుండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా శక్తినిస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము.

credit: Freepik

మొదటగా రాగి పిండిని తీసుకుని దానిని బాణలిలో వేసి కొద్దిగా వేయించుకుని చల్లారనివ్వాలి.

credit: Freepik

ఆ తర్వాత బాదం పప్పులను పొడిగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

credit: Freepik

ఇప్పుడు గిన్నెలో రాగి పిండి, బాదం పొడి, బెల్లం లేదంటే పంచదార అన్నింటినీ సరిపడినన్ని నీళ్లలో వేసి కలపాలి.

credit: Freepik

ఇలా తయారైన మిశ్రమాన్ని చిన్న సెగ మీద పెట్టి వుండలుగా కాకుండా కలియతిప్పుతూ ఉడికించాలి.

credit: Freepik

కొద్దిసేపటి తర్వాత మాల్ట్ చిక్కబడగానే అందులో పాలు పోసి ఓ 3 నిమిషాలు వుడికించాలి.

credit: Freepik

ఆ తర్వాత రుచి, సువాసన కోసం కొద్దిగా యాలుకలు పొడి వేసుకోవాలి.

credit: Freepik

ఈ బాదం, రాగి మాల్ట్‌ను చల్లార్చుకుని తాగేయవచ్చు

credit: Freepik

ఈ 5 పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

Follow Us on :-