ఆరోగ్యాన్ని కాపాడే బాదములు, ఎన్ని తినాలి?

వైవిధ్యమైన గింజ ధాన్యాలలో బాదము ఒకటి. దీనిలో విటమిన్‌ ఇ, మెగ్నీషియం, రిబోఫ్లావిన్‌, జింక్‌ తదితర 15 రకాల పోషకాలు ఉంటాయి. రోజువారీ ఆహారంలో కనీసం 23 బాదములు ఎందుకు జోడించుకోవాలో ముఖ్య కారణాలు ఇవిగోండి.

webdunia

బాదములు వల్ల గుండె వ్యాధులను కలిగించే ప్రమాద కారకాలను నివారించడం సాధ్యమవుతుంది

సంప్రదాయ స్నాక్స్‌ స్థానంలో బాదములను జోడించుకోవడం ద్వారా హార్ట్‌రేట్‌ వేరియబిలిటీ అనేది మానసిక ఒత్తిడికి అనుగుణంగా మెరుగుపడుతుంది.

బాదములను తరచుగా తినడం వల్ల అది రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.

విటమిన్‌ ఇ, జింక్‌, రాగి, ఫోలేట్‌, ఐరన్‌ వంటివి బాదములలో వున్నాయి.

బాదములను తీసుకోవడం వల్ల అనాలోచితంగా అత్యధిక కొవ్వు కలిగిన ఆహారం తీసుకోవాలన్న కోరికను అధికమించవచ్చు.

బరువు నియంత్రణ వ్యూహాలను ఖచ్చితంగా అమలు చేసేందుకు బాదములు తోడ్పడుతాయి.

మధుమేహం వున్నవారు మాత్రం 23 బాదములకు మించి తీసుకోరాదు.

గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.

గుండె- కాలేయ వ్యాధులను నిరోధించే మారేడు ఆకులు

Follow Us on :-