టీ ప్రయోజనాలు, ఈ పది రకాల టీలు తాగితే?

నేడు అంతర్జాతీయ టీ డే. టీ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. టీలలో గ్రీన్ టీ, బ్లాక్ టీ, సాంప్రదాయ టీలు ఎన్నో వున్నాయి. ఇప్పుడు మనం 10 రకాల టీలు, అవి మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలుసుకుందాము.

credit: Instagram and Twitter

మందార టీ, రక్తపోటును నియంత్రించాలంటే మందార టీని సేవించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మందారంలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి.

అల్లం టీ, జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం టీ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఐతే కడుపులో అల్సర్ ఉన్న వాళ్లు అల్లం టీకి దూరంగా వుండాలి.

పసుపు టీ, పసుపు టీ లేదా గోల్డెన్ టీ తాగడం వలన బరువు తగ్గించడంతోపాటు, గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది.

బాదం టీ, దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం, మంటను తగ్గించడం, శరీరాన్ని నిర్విషీకరణ చేయడం, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడం వంటి సామర్థ్యాన్ని కలిగి వుంది.

మునగ ఆకు టీ, మునగ ఆకుల టీ సేవించడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. రక్తపోటును అదుపులో వుంచుంది. రక్తంలో చక్కెరస్థాయిలను అదుపులో పెడుతుంది. కొవ్వులు చేరకుండా అడ్డుకుంటుంది.

మల్లెపూవు టీ, రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. హృదయసంబంధ వ్యాధులను, పక్షవాతాన్ని రానీయదు.

లెమన్ గ్రాస్ టీ, ఈ టీ తాగ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రంతో పాటు త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పులు, క‌డుపు నొప్పి త‌గ్గుతాయి. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి.

దాల్చిన చెక్క టీ, దాల్చిన చెక్క టీ ఒంట్లో వుండే పరాన్నజీవులన్నింటినీ చంపేసి, విషపూరిత పదార్థాల నుంచి శరీరాన్ని పరిశుభ్రం చేస్తుంది.9. గ్రీన్ టీ

గ్రీన్ టీ, ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్దుష్టంగా ఉంచుతుంది. గ్రీన్ టీకి శరీరంలోని క్రొవ్వు మరియు రక్తపీడనాన్ని తగ్గించే శక్తి వుంది. గ్రీన్ టీ శరీరాన్ని సన్నగా, ఫిట్‌గా ఉంచుతుంది.

జామ ఆకుల టీ, జామ ఆకు టీ తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. జలుబూ, దగ్గూ నెమ్మదిస్తాయి.

గమనిక: ఈ చిట్కాలను పాటించే ముందు వైద్యుడిని సంప్రదించాలి

అవకాడో పండు ఉపయోగాలు తెలుసా?

Follow Us on :-