హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

గ్రీన్ టీ, బ్లాక్ టీ, సాంప్రదాయ టీల లోని కొన్ని రకాలు. హెర్బల్ టీలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులతో రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

రక్తపోటును నియంత్రించే మందార టీలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి.

జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం టీ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

పసుపు టీ తాగితే అందులోని కుర్కమిన్ అనే పదార్థంలో యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడంలో బాదం టీ బాగా పనిచేస్తుంది.

మునగ ఆకుల టీ తాగితే బరువు తగ్గించుకోవచ్చు, రక్తపోటును, రక్తంలో చక్కెరస్థాయిలను అదుపులో పెడుతుంది.

మల్లెపూల టీ తాగితే రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది.

గ్రీన్ టీ అధిక రక్తపోటును, కాంజేస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వంటి గుండె సంబంధిత వ్యాధులను రాకుండా ఆపుతుంది

జామ ఆకుల టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. జలుబూ, దగ్గూ నెమ్మదిస్తాయి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

Follow Us on :-