జామ ఆకులుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

జామ ఆకులో మనకు తెలియని అనేక ఔషధ గుణాలున్నాయి. జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతల బారిన పడకుండా కాపాడతాయి. జామ ఆకులు, జామ బెరడు, జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

credit: social media and webdunia

నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలితే ఫలితాలను పొందవచ్చు.

జామ ఆకులు కషాయం జుట్టుకి దివ్యౌషధంలా పని చేస్తుంది, జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదపడుతుంది.

జామ ఆకుల కషాయం తీసుకోవడం వలన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, శరీరంలో రక్తం అన్ని అవయవాలకు సక్రమంగా అందేలా చూస్తుంది.

మొటిమల సమస్యతో బాధపడేవారు జామ ఆకుల్ని మెత్తగా రుబ్బి ముఖానికి లేపనంలా పూసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

లేత జామ ఆకుల్ని మెత్తగా పేస్ట్‌లా రుబ్బి దానికి కొద్దిగా ఉప్పు, అర చెంచా జీలకర్రను కలిపి వేడినీళ్లతో తీసుకుంటే ఆకలి పెరుగుతుంది.

జామ పువ్వులను మెత్తగా నూరి కళ్లపై ఉంచితే కళ్లు తేటగా తయారవుతాయి. కళ్ల కలక, కళ్లు నీరు కారడం, కళ్లు ఎర్రబడటం వంటి సమస్యలను దూరం చేస్తాయి.

కీళ్ల నొప్పులతో బాధపడేవారు జామ ఆకులను కొద్దిగా వేడి చేసి వాపులున్న చోట కట్టుకుంటే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.

జామ ఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

జామ ఆకుల కషాయం తాగితే మధుమేహం అదుపులోకి వస్తుంది

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

ఈ వ్యాధులకు మునగకాయలు దివ్యౌధంలా పనిచేస్తాయి, ఏంటవి?

Follow Us on :-