చెవులు కుట్టించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

చెవులు కుట్టించడం. ఈ ప్రక్రియలో ఆధ్యాత్మిక పరమైన నమ్మకాలు వున్నప్పటికీ ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ఫలితాలు వున్నాయి. చెవులు కుట్టించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and pixabay

చెవులు కుట్టించుకోవడం వల్ల ఆడవారిలో ఆరోగ్యకరమైన ఋతు చక్రం నిర్వహించడానికి సహాయపడుతుంది.

ఆక్యుప్రెషర్ థెరపీ సూత్రాలను అనుసరించి చెవి కుట్టడం వల్ల మెదడు ఆరోగ్యకరమైన, శీఘ్ర అభివృద్ధిలో సహాయపడతుందని తేలింది.

చెవిపోగులు ధరించినప్పుడు వారి శరీరంలో శక్తి ప్రవాహం నిర్వహించబడుతుంది.

చెవి యొక్క కేంద్ర బిందువు దృష్టి కేంద్రం కనుక ఈ పాయింట్లపై ఒత్తిడి చేయడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

పిల్లల వినికిడి శక్తిని నిర్వహించడంలో చెవులు కుట్టించడం దోహదపడుతుంది.

చెవులు కుట్టించడం వల్ల భయము, ఆందోళన వంటి పరిస్థితులు దూరం చేయబడతాయి.

చెవి కుట్టిన ప్రదేశం పాయింట్ యొక్క ఉద్దీపన వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా వుంటుందని చెప్పబడింది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

అధిక బరువు- ఊబకాయంతో వచ్చే జబ్బులు ఏమిటో తెలుసా?

Follow Us on :-