వేసవిలో మట్టి కుండలోని చల్లని నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు

వేసవిలో ఫ్రిడ్జ్‌లో పెట్టిన చల్లని మంచినీటికి బదులు కుండలో పోసి తాగే నీరు ఎంతో ఆరోగ్యకరం అని వైద్య నిపుణులు చెపుతున్నారు. చల్లని నీటి కోసం మట్టి కుండను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము.

credit: social media and webdunia

మట్టి కుండలో నీటిని నిల్వ చేయడం వల్ల నీరు సహజంగా చల్లబడుతుంది.

బంకమట్టి ఆల్కలీన్ స్వభావం కలిగి ఉండటంతో ఇది ఆమ్ల ఆహారాలతో సంకర్షణ చెందుతుంది.

బంకమట్టి కుండలోని నీరు pH సమతుల్యతను అందించడంతో ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యను దూరం చేస్తుంది.

మట్టి కుండలో నిల్వ చేసిన నీటిలో ఎలాంటి రసాయనాలు ఉండవు కనుక ప్రతిరోజూ కుండ నీటిని తాగితే జీవక్రియ పెరుగుతుంది.

మట్టి కుండ నీరు త్రాగడం వడదెబ్బను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.

మట్టి కుండ నీటిలో ఖనిజాలు, పోషకాలను చెక్కుచెదరకుండా ఉంచుతుంది కనుక త్వరగా రీహైడ్రేట్ అవుతుంది.

మట్టి కుండ నీరు ఒక ఆదర్శ ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది కనుక గొంతు సంబంధిత సమస్యలు దరిచేరవు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం

Follow Us on :-