కొత్తిమీరతో ఆరోగ్యం, అందం ఎలాగంటే?

వంటకాలలో రుచి కోసం, వాసన కోసం, గార్నిష్ కోసం కొత్తిమీరను వాడుతూ ఉంటాం. ఇది రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. దీని ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాము.

credit: social media

కొత్తిమీర యాంటీ-ఆక్సిడేంట్స్‌ని కలిగి ఉండటము వలన ఆరోగ్యానికి చాలా మంచిది.

కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వును తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు స్థాయిలను పెంచుతుంది.

ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గించటంలో కొత్తిమీర ప్రధానపాత్ర వహిస్తుంది.

ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ కె కొత్తిమీరలో పుష్కలంగా ఉంటుంది.

అజీర్ణం, వాంతులు వంటి వాటిని తగ్గించడంలో కొత్తిమీర సహాయపడుతుంది.

కొత్తిమీర యాంటీ-ఆక్సిడెంట్స్‌లను కలిగి ఉండటం వల్ల కంటి వ్యాధులు రాకుండా ఆపుతుంది.

పిల్లలు, పెద్దల్లో వచ్చే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌ను నివారించుకోవచ్చు.

కొత్తిమీరలో పోషకాలతో పాటు, ఐరన్ కంటెంట్ ఉండటం వల్ల ఇది అనీమీయాను తగ్గిస్తుంది.

కొత్తిమీర బ్లడ్ ఫ్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

మళ్లీ కరోనా పంజా: రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

Follow Us on :-