గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. చిన్నదిగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీనివల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది. అయితే ప్రారంభ దశలోనే చికిత్స చేస్తే గ్యాస్ట్రిక్ బారినపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం చేసే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia
ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగితే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు.
పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది.
చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి.
ఆహారంలో వెల్లుల్లిని తగినంత తీసుకున్నా గ్యాస్ సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు.
టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని ఏదో ఒక ఆహారంలో చేర్చుకుంటే గ్యాస్ సమస్య నెమ్మదిస్తుంది.
వారానికి ఒకసారి దోసకాయను తింటుంటే గ్యాస్ సమస్య తలెత్తకుండా వుంటుంది.
గ్యాస్ సమస్య వున్నవారు ప్రతిరోజూ ఉదయం పరగడుపున గోరువెచ్చని మంచినీళ్లు తాగాలి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి