యవ్వనంగా ఎక్కువకాలం జీవించేలా చేసే ఆహారం, అలవాట్లు ఏమిటి?
ఆకలి వేస్తుంది కదా అని ఏదిబడితే అది తినేస్తుంటే శరీరంలో మార్పులు వచ్చేస్తాయి. ముఖ్యంగా వయసుకి తగ్గట్లుగా కాకుండా త్వరగా వృద్ధాప్యాన్ని సమీపిస్తున్నట్లుంటుంది కొందరిలో. కనుక అలా కాకుండా వయసు పెరిగినా యవ్వనంగానూ, ఎక్కువకాలం జీవించేలా చేసే ఆహారం, అలవాట్లు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia
బ్రోకలీ, క్యాబేజీ, అవకాడో, దోసకాయ, టొమాటో వృద్ధాప్యంతో ముడిపడి ఉన్న జన్యు మార్పులను నివారించి యవ్వనంగా వుండేలా చేస్తాయి.
ఉసిరికాయలు దీర్ఘాయువును ఇస్తాయంటారు, రోజూ 4 చెంచాల ఉసిరి రసం తాగుతుంటే వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకుంటుంది.
పసుపులో వున్న కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఆయుష్షును పెంచడంలో సహాయపడుతుంది.