చాలామంది ఉదయం ఆకలవుతుందని చేతికి దొరికిన పదార్థాలను తినేస్తుంటారు. ఐతే పరగడుపున కొన్ని ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. తింటే అనారోగ్యం బారిన పడతారు. అవేమిటో తెలుసుకుందాము.
credit: Freepik
పరగడుపున అరటికాయలు తింటే కడుపులో ఎసిడిటిని పెంచుతుంది, ఫలితంగా జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.
పెరుగును అన్నంతో పాటు కానీ లేదంటే ఆహారం తిన్న తర్వాత కానీ తీసుకుంటే మేలు చేస్తుంది, ఐతే ఖాళీ కడుపుతో తింటే అనారోగ్యానికి కారణమవుతుంది.
పుల్లని పండ్లలో సిట్రిక్ యాసిడ్ అధిక స్థాయిల్లో వుంటుంది కనుక ఖాళీ కడుపుతో తింటే కడుపులో మంట, ఎసిడిటి సమస్య వస్తుంది.
కొందరికి నిద్ర లేవగానే పరగడుపున కాఫీ లేదా టీ తాగడం చేస్తుంటారు. ఐతే వాటిని తాగితే గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తవచ్చు.
పరగడుపున పచ్చి కూరగాయలను తింటే గ్యాస్ సమస్య వస్తుంది, ఎందుకంటే వీటిలో ఫైబర్ అధికంగా వుంటుంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారంకోసం నిపుణులను సంప్రదించాలి.