జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బాహ్య సౌందర్యంలో ముఖ్యమైనవి కేశాలు. కొందరికి జుట్టు వున్నట్లుండి ఒక్కసారిగా ఊడిపోవడం జరుగుతుంది. దీనికి కారణం ఏమిటో తెలియక ఆందోళన చెందుతుంటారు. ఐతే కొన్ని రకాల పదార్థాలు తింటే కేశాలు రాలిపోయే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

తీపి పదార్థాలు ఇన్సులిన్ నిరోధకత ఆండ్రోజెన్ స్థాయిలను పెంచి హెయిర్ ఫోలికల్స్ కుదించే, జుట్టు పల్చబడటానికి దారితీసే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి.

వేయించిన ఆహారాలలో తరచుగా అనారోగ్యకరమైన కొవ్వులు, ట్రాన్స్ కొవ్వులు ఉంటాయి కనుక వీటిని తినరాదు.

డైట్ సోడాలు, చక్కెర రహిత గమ్, ఇతర కృత్రిమ స్వీటెనర్లను కలిగి ఉన్న ఉత్పత్తులని దూరం పెట్టాలి.

కొంతమందికి పాల ఉత్పత్తులకు సున్నితత్వం లేదా అలెర్జీలు ఉండవచ్చు, దీనివల్ల స్కాల్ప్ సమస్యలు తలెత్తి జుట్టు ఊడవచ్చు.

అధిక పాదరసం స్థాయిలు ఉన్న చేపలు తిన్నప్పుడు కూడా హెయిర్ ఫోలికల్ ఆరోగ్యానికి ఆటంకం కలిగించి జుట్టు రాలిపోవచ్చు.

ప్రాసెస్ చేసిన ఆహారాలు జుట్టు ఆరోగ్యానికి కీలకమైన అవసరమైన పోషకాలను కలిగి ఉండవు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

Follow Us on :-