ఏ ఆకులో భోజనం చేస్తే ఎలాంటి ఫలితమో తెలుసా?

ఇపుడంతా ఫ్యాషన్‌గా పేపర్ ప్లేట్లలో భోజనం చేస్తున్నారు. కానీ అరటి ఆకు, మోదుగ ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు వున్నాయని వైద్యులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము.

credit: Instagram

అరటి ఆకులో భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచి జరుగుతుందని పెద్దలు, వైద్యులు చెబుతున్నారు.

credit: Instagram

ఆకుపచ్చని అరటి ఆకులో వేడి వేడి పదార్థాలను వేసుకుని భుజించటం వల్ల కఫవాతాలు తగ్గిపోతాయి.

credit: Instagram

అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఆరోగ్యం చక్కబడి, శరీరానికి మంచి కాంతి వస్తుంది.

credit: Instagram

పచ్చగా ఉండే అరటి ఆకులో ఆహారం పెట్టుకుని తినటం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది.

credit: Instagram

మోదుగ ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందనీ, మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని అంటారు.

credit: Instagram

మర్రిచెట్టు ఆకులలో అన్నం తింటే, క్రిమిరోగ నివారిణిగా పనిచేస్తుంది. కంటికి సంబంధించిన దోషాలను తొలగిస్తుంది.

credit: Instagram

అరటి, మోదుగ ఆకులలో భోజన చేయటంవల్ల ప్రేగులలోని క్రిములు నాశనమవుతాయని ఆయుర్వేదం చెబుతోంది.

credit: Instagram

మందారం టీ తాగితే ఏంటి ప్రయోజనం?

Follow Us on :-