డయాబెటిస్ వున్నవారు ఈ 4 పానీయాలు తాగితే...

రాత్రి పడుకునే ముందు ఈ పానీయాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

మెంతి గింజల నీరు - దీని విత్తనాలలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి.

1 టీస్పూన్ మెంతి గింజలను 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, వడకట్టి ఉదయం త్రాగాలి.

పసుపు పాలు - పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.

దీని కోసం, ¼ టీస్పూన్ పసుపును వేడి పాలలో కలిపి పడుకునే ముందు త్రాగాలి.

దాల్చిన చెక్క నీరు - దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో సహాయపడుతుంది.

1 గ్లాసు నీటిలో 1/2 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి, రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం తాగాలి.

గ్రీన్ టీ - ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి, యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి.

దీనిని తయారు చేయడానికి, 1 కప్పు వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ వేసి 2-3 నిమిషాల తర్వాత సేవించాలి.

గుండెపోటు తెచ్చే అధిక రక్తపోటు, సింపుల్‌గా అదుపులోకి తెచ్చేదెలా?

Follow Us on :-