డెంగ్యూ ఫీవర్ లక్షణాలు - చికిత్స

వర్షాకాలం ప్రారంభం కాగానే పీడించే వ్యాధుల్లో డెంగ్యూ ఫీవర్ ఒకటి. ఈ జ్వరం దోమల వల్ల వ్యాపిస్తుంది. అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం లేకపోలేదు. డెంగ్యూ జ్వరం లక్షణాలు, జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము.

Credit: Pixabay and WD

డెంగ్యూ వల్ల తీవ్ర‌మైన జ్వ‌రం, త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చ‌ర్మంపై ద‌ద్దుర్లు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

డెంగ్యూ జ్వరం వచ్చినవారు ఒకచోట స‌రిగ్గా నిలుచోలేరు, కూర్చోలేరు. బెడ్‌కే ప‌రిమితం కావ‌ల్సి వ‌స్తుంది.

గంట‌లు గ‌డుస్తున్న కొద్దీ ఆరోగ్యం మ‌రింత క్షీణించి ప్రాణాల‌కు ప్ర‌మాదం క‌లిగే అవకాశం ఉంటుంది.

డెంగ్యూ వచ్చిన వారి ర‌క్తంలో ఉండే ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా బాగా త‌గ్గి ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది.

సాధార‌ణ వ్య‌క్తుల్లో ప్లేట్‌లెట్లు 1.5- 4.5 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటే, డెంగ్యూ వ‌చ్చిన వారిలో 1.5 ల‌క్షల క‌న్నా త‌క్కువ‌గా ఉంటుంది.

ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచ‌డం కోసం వైద్యులు ప‌లు ర‌కాల మందుల‌ను, విట‌మిన్ స‌ప్లిమెంట్ల‌ను రోగుల‌కు అందిస్తారు.

రోగి కోలుకున్న త‌రువాత కూడా కొన్ని రోజులవ‌ర‌కు మందుల‌ను, స‌రైన ఆహారం తినాల్సిందే.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

వర్షాకాలంలో ఈ పదార్థాలను తినకపోవడం మంచిది, ఎందుకంటే?

Follow Us on :-