దాల్చిన చెక్క. వంటకాల తయారీలో మంచి రుచి సువాసనిచ్చే ద్రవ్యం. ఇది ఔషధంగానే కాకుండా చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు, అది చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Instagram
గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం- సాయంత్రం తీసుకుంటే జలుబూ, దగ్గు తగ్గుతాయి.
ఒక భాగం దాల్చిన చెక్క చూర్ణానికి మూడు భాగాలు తేనె కలిపి, రాత్రి పట్టించి ఉదయం గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమల సమస్య తగ్గిపోతుంది.
దాల్చిన చెక్కని నిమ్మరసంతో నూరి తీసిన గంధాన్ని పట్టిస్తుంటే నల్లమచ్చలు తగ్గిపోతాయి.
దాల్చిన చెక్క, శొంఠి, యాలుకలు, సైంధవ లవణ చూర్ణాలను సమానంగా కలిపి ఆహారం తిన్న తరువాత అర గ్లాసు గోరువెచ్చని నీటితో కలిపి తాగితే అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
దాల్చిన చెక్క, పసుపు, పొడపత్రి, నల్లజీలకర్ర చూర్ణాలను సమానంగా కలిపి అరచెంచా పొడిని పావు గ్లాసు పాలల్లో కలిపి తాగితే మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.