శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

ప్రపంచవ్యాప్తంగా వైకల్యం, మరణానికి బ్రెయిన్ స్ట్రోక్‌లు ప్రధాన కారణాలలో ఒకటి, చల్లని వాతావరణం ఈ ప్రాణాంతక సంఘటనలకు ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుంది. శీతాకాలపు చలి ఉష్ణోగ్రతలు రక్త నాళాలను కుదిస్తాయి, రక్తపోటును పెంచడమే కాకుండా గడ్డకట్టే సంభావ్యతను పెంచుతాయి. ఇది స్ట్రోక్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఐతే, నిర్దిష్ట జీవనశైలి అలవాట్లను అవలంభిస్తే తప్పించుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

30 నిమిషాలు ముఖ్యంగా శీతాకాలంలో హృదయ సంబంధ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో శారీరక శ్రమ చాలా ముఖ్యమైనది.

వ్యాయామం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

సమతుల్య ఆహారం స్ట్రోక్ నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది కనుక పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యతనివ్వాలి.

శీతాకాలంలో నీరు తాగకపోతే రక్తం మందంగా మారి స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి.

మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం కనుక కనీసం 7 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి.

ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాలు వంటి ఒత్తిడి నిర్వహణ పద్ధతులతో బ్రెయిన్ పైన ఒత్తిడి లేకుండా చేస్తాయి.

స్ట్రోక్‌తో సంబంధం ఉన్న ప్రమాద కారకాలను పర్యవేక్షించడానికి క్రమంతప్పకుండా ఆరోగ్య తనిఖీలు అవసరం.

ప్రతిరోజూ బాదం పప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Follow Us on :-